
చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ లేబరేటరీ పరిశ్రమ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పరిశ్రమ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరెగూడెం గ్రామస్తులు మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. దివీస్ ల్యాబ్ కాలుష్యం వలన పంటలు పండడం లేదని భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని, కాలుష్యాన్ని తరలించాలని, ప్రత్యమాయంగా కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, ఉత్పత్తుల వలన భూగర్భ జలాలు కలుషితమై, కలుషిత నీటిని తాగి పశువులు గత 20 సంవత్సరాలుగా మృత్యువాత పడుతున్నాయని, భూగర్భ జలాలు కలుషితం కావడం వలన ప్రజలు అనారోగ్యం పాలై కాళ్ల మంటలు దురద రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ రాత్రి వేళలో ఆగిపోయినంత పరిస్థితి ఉందని ఆరోపించారు. గ్రామాన్ని ప్రజలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, తక్షణమే పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో సర్పంచ్ జాల మల్లేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యుడు నాగరాజు రెడ్డి ఉన్నారు.