పలు సంఘటనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి

– ప్రభుత్వ వసతి గృహాలపై సరైన నిఘా ఏర్పాటు చేయాలి
– ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఫిబ్రవరి 3న భువనగిరిలొని ఎస్సీ బాలికల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థినీలు కోడి భవ్య, గాదె వైష్ణవిల ఆత్మహత్యలకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డిటిఓ నారాయణ రెడ్డిలకు సోమవారం వేరువేరుగా వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ధర్మ టీచర్స్ యూనియన్ జిల్లా కన్వినర్ ఎర్ర సుదాకర్ మాట్లాడుతూ ఎస్సీ బాలిక వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీల మరణాల పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రభుత్వ వసతి గృహాల వద్ద నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో విధులకు హాజరు కాకుండానే వేతనం తీసుకుంటున్న ఉపాద్యాయుడు ముదిరెడ్డీ నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుజోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ టీచర్స్ యూనియన్(డీటీయూ) జిల్లా కో కన్వినర్లు సిహెచ్ యాదగిరి, డి భిక్షపతి, బి నాగార్జున, ఎం లింగస్వామి, పి మహేష్, పి సంధ్యారాణి, ఎన్ స్వామి లు పాల్గొన్నారు.