– మాజీ సర్పంచ్ సత్యనారాయణ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి నాయకుడు లేడనీ, ఏమైనా సమస్యలుంటే సమస్యలు పరిష్క రించేందుకు నాయకుడిని నియమించాలని గురువారం శంకర్‌పల్లి మండలంలోని శేరిగూడ గ్రామ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, మాజీ వార్డు సభ్యులు కలిసి మాజీ మంత్రి కేటీఆర్ కలిసి సమస్యలు వెల్లడించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ శంకర్‌పల్లి మండలంలో బీఆర్‌ఎస్ పార్టీకి నాయకుడు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. మండల నాయకులందరూ కూడా పార్టీ మారడంతో లీడర్ లేకపోవడంతో పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆయన స్పందించి ఎవరు కూడా అధైర్య పడకుండా ఉండండి తాను పది రోజుల్లో మీ మండలానికి వచ్చి, అన్ని సమ స్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చినట్టు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, రాజేందర్, ప్రసాద్, యాదగిరి, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.