నియామక ఉత్తర్వులు ఇప్పించాలని వినతి..

నవతెలంగాణ – భీమ్‌గల్
61 ఏండ్లు పై బడిన వీఆర్ఏ వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇప్పించాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. శనివారం భీంగల్ వీఆర్ఏ ల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ని కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం వీఆర్ఏ లను రెగ్యులర్ చేయడంతో పాటు కారుణ్య నియామకాల కొరకు జీవో నెంబర్ 81, 85 ప్రకారం 3797 మంది 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కానీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేక పోవడం తో నిర్ణయం అలాగే ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లో వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాల కొరకు ఉత్తర్వులు ఇప్పించి 3797 వీఆర్ఏ కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్సీ ని కోరారు.