
నవతెలంగాణ – నూతనకల్
ఉమ్మడి మండలాలలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తుంగతుర్తి శాసనసభ సభ్యుడు సామెల్ కు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తీగల గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు విన్నపించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుండి భూ రికార్డులో కాస్తలో భూ యజమాని పేరు ఉన్నప్పటికీ ఉంటున్నప్పటికీ పట్టా కాక ధరణిలో పేరు లేకపోవడంతో అందించే క్రాఫ్ట్ లోన్ లోగాని రైతు బంధు వంటి అనేక రాయితీలను పొందలేకపోతున్నామని అన్నారు. కనీసం తాము పండించుకున్న పంటను అమ్ముకోవడానికి కూడా తమకు పట్టాదారి పాసు బుక్కులో భూమి లేకపోవడంతో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుమారు 200 రైతుల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు సమస్యలు విన్న శాసనసభ సభ్యుడు సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీగల మల్లారెడ్డి, సాబాది వాసుదేవరెడ్డి, ఉమ్మడి మండలాల రైతులు భీమిడి నారాయణ రెడ్డి, యుద్ధం రెడ్డి, ఏలేటి సత్తి రెడ్డి, గుర్రం ఎంకన్న, సొప్పరి ఏసు తదితరులు పాల్గొన్నారు..