కళ్యాణ మండపానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో ఉన్న మాదిగ దండోరా సంఘ సభ్యులకు కళ్యాణ మండపం నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ తెలిపారు. నిజాంబాద్ పట్టణంలోని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నివాసంలో మాదిగ దండోరా సంఘ సభ్యులు కలిసి ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి సానుకూలంగా స్పందించారని ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో రవి, ప్రసాద్ ,భోజన్న, గంగన్న, సాయన్న, ప్రవీణ్, గంగాధర్ మాదిగ దండోరా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.