బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేకు వినతి

Request to MLA to restore bus facilityనవతెలంగాణ – ఐనవోలు
మండలంలోని పెరుమాండ్లగూడెం గ్రామానికి గతంలో వరంగల్ నుండి నందనం వెళ్లే బస్సును పెరుమండ్లగూడెం గ్రామం మీదుగా వెళ్లేందుకై బస్సు సౌకర్యం ఉండేది. రోడ్లు మరమ్మతుల విషయంలో కొద్దిరోజులుగా బస్సు రావడం లేదు. ప్రస్తుతం గ్రామస్తులు రోడ్ కు మరమ్మత్తులు చేసారు. గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునురుద్దరించలని వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ని కలిసి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు హనుమకొండ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే బతుకమ్మ ఆడేందుకు స్థలం లేకపోవడంతో పోచమ్మ గుడివద్ద చెరువు కట్ట దగ్గర బురద కావడంతో రోడ్డు కాంట్రాక్టర్ తో మాట్లాడి రెండు టిప్పర్ల చిప్స్ కంకర పోయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూస చిరంజీవిరెడ్డీ, పెరుమాండ్లగూడెం గ్రామ బిజెపి నాయకులు యుగేందర్ రావు, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు కోల సంపత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడుగు మల్లయ్య ,పిడుగు రాజాలు తదితరులు పాల్గొన్నారు.