చింతలూరు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని చింతలూర్ విడిసి సభ్యులు ఎమ్మెల్యే భూపాతి రెడ్డిని కలిసి గ్రామ సమస్యల గురించి మంగళవారం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి పూల మొక్కేను అందజేశారు. చింతలూరు గ్రామంలోని ముఖ్యమైన సమస్య లు గుట్ట మీద గుడి నిర్మాణం, అలాగే నిజామాబాద్ నుండి భీమ్ గల్ వరకు బస్ వేయాలని మరియు యేటికల తూము చెప్పగానే అట్టిసమస్యలపై వెంటనే స్పందిచి సంబంధిత అధికారులకు ఫొన్ చేయడం జరిగిందని కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతలూర్ విడిసి సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు