బస్వపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బిఎన్ తిమ్మాపూర్ గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపీటీసీ ఉడుత శారదా ఆంజనేయులు యాదవ్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ.. బిఎన్ తిమ్మాపూర్ గ్రామ ఇండ్ల డబ్బులు త్వరగా ఇప్పించాలని,మిగిలిన పట్టా కబ్జా భూముల నష్టపరిహారం ఇప్పించాలని, హుస్నాబాద్ వద్ద కేటాయించిన పునరావాసం లో మా నిర్వాసితులు చాలా మంది ఇండ్ల నిర్మాణం చేపట్టారని అందులో రోడ్లు, డ్రైనేజి, మంచి నీటి సమస్య లను మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా సెక్టార్ 1 కి రోడ్డు సమస్యను త్వరగా పూర్తి చేయాలని, కొందరికి ఇంతవరకు ప్లాట్లు చూపించలేదని, అవికూడా త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ.. బిఎన్ తిమ్మాపూర్ గ్రామ సమస్య ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు వివరించడం జరిగిందని, సాధ్యమైనంత త్వరలో మీ ఇండ్ల డబ్బులు ఇప్పిస్తానని అధికారులతో మాట్లాడి పునరావాసం లో మౌలీక వసతులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.