నవతెలంగాణ- భీంగల్
మండలంలోని మెండోరా గ్రామంలో బస్టాండ్ వద్ద మురికి నీరు రోడ్డుపై పారుతుండడంతో ఆ కాలనీలో మురికి నీరుతో దుర్గంధం వెదజల్లే పరిసర ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై కాలనీవాసులు ఎంపీడీవో రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఎంపీడీవో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. గతంలోనూ ఎంపీడీవో కు ఫిర్యాదు చేసినను చలనం కరువు గ్రామంలోని మురికి కాలువ ద్వారా వస్తున్న మురికి నీరు రోడ్డుపై పారుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ కాలనీవాసులు సంవత్సరం క్రితమే ఎంపీడీవో రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేయగా స్వయంగా ఎంపీడీవో మెండోరాకి వెళ్లి పరిశీలించి ఈ విషయమై ప్రజా ప్రతినిధులకు పరిష్కరించాలని తెలియజేసినట్లు ఎంపీడీవో తెలిపారు. కానీ సంవత్సరం దాటుతున్నాను ఇప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆ కాలనీవాసులు మండిపడుతున్నారు.