పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కు వినతి 

Request to MPDO to solve the problems of sanitation workers– ఈనెల 8న ఒకరోజు సమ్మె చేస్తామని ఎంపీడీవో కు వినతి
– గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ మండల కార్యదర్శి బొల్లం ఎల్లయ్య 
నవతెలంగాణ – నెల్లికుదురు 
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ యూనియన్ మండల కార్యదర్శి బొల్లం ఎల్లయ్య తెలిపాడు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాలరాజుకు ఈనెల 8వ తారీఖున ఒకరోజు సమ్మె నిర్వహిస్తామని వినతి పత్రాన్ని మంగళవారం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో హామీలు ఇచ్చారని నేటికి వారి సమస్య పరిష్కరించకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారని అన్నారు చాలీచాలని వేతనాలతో ఎన్నో ఏళ్ల నుండి విధులు నిర్వహిస్తున్నామని అన్నారు కనీసం భార్య పిల్లలను పోషించుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దీనిలో భాగంగా మా పిల్లలను చదివించుకునేందుకు ఆర్థికంగా స్థామత లేక చదివించుకోలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మానే అన్నారు పొద్దున లేచినప్పటి నుండి గ్రామంలో చెత్త చెదారం మురికి నీరు ఇండ్లలో నుండి వస్తున్న వేస్టేజ్ ఎన్నో రకాలైనటువంటి ఉడ్చి ఎత్తిపోస్తున్నామని అన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కూడా మేము పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మా కష్టం ప్రభుత్వం దృష్టికి వెళ్లాలని ఉద్దేశంతో ఈ నెల 8వ తేదీన ఒకరోజు పూర్తిగా పనులు చేయమని ఎంపీడీవో బాలరాజుకు వినతి ని అందించామన్నారు . పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే ఇచ్చి పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి వేతనాలు ప్రభుత్వమే చెల్లించే విధంగా తక్షణమే బడ్జెట్ కేటాయించాలి . మల్టీ పర్పస్ విధానం 51 జీవోను రద్దుచేసి 60 జీవో ను అమలు చేసి  విధి నిర్వహణలో ప్రమాదవశత్తుతో మరణిస్తే 10 లక్షలు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి ,వీరయ్య, బానోత్ వెంకన్న పాల్గొన్నారు.