ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  తలపెట్టిన 6 గ్యారంటీల పథకమునకు సంబంధించి గతంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగినదనీ గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల నిమిత్తం ప్రభుత్వం కొంతమంది అప్లికేషన్లను ఆన్లైన్ చేయటం కొరకు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కి బిఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.  ఆన్లైన్ కౌంటర్లను మున్సిపల్ కార్యాలయంలో  పాత మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేసి ఆన్లైన్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ తాడూరు బిక్షపతి, గుండబోయిన సురేష్ యాదవ్, సిరిపంగా సుభాష్ , హరికిషన్ లు పాల్గోన్నారు.