
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులు సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గత రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్ చేస్తూ జీవో జారీ చేసిందని, అందులో 3797 మందిని 61 సంవత్సరాలు పైబడిన వారిగా ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. వారి వారసులకు చదువులను బట్టి క్యాడర్ నిర్ణయించిన జీవోలను టిఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిందని, జీవోలు జారీ అయి ఆరు నెలలు గడుస్తున్న తమకు ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వలేదని వినతి పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం నుండి నియామక పత్రాలు అందేలా చూడాలని వేడుకున్నారు. ఇందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించి మీకు కచ్చితంగా నియామక ఉత్తర్వులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని హామీని ఇచ్చారు. వినతి పత్రంతోపాటు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవో కాపీలు అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించినట్లు వీఆర్ఏల వారసులు తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసిన వారిలో సజ్జు, శంకర్, శ్రీనివాస్, మూర్తి, తదితరులు ఉన్నారు.