నవతెలంగాణ – చండూరు : మర్రిగూడ మండలం చెర్లగూడ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న కుదాబాక్ష్ పల్లి గ్రామ రెవిన్యూ కి సంబంధించిన 58 ఎకరాల రైతులు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ గురువారం చండూర్ ఆర్డీవో దామోదర్ రావు కి సిపిఐ మండల నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి మాట్లాడుతూ శివన్నగూడ రిజర్వాయర్ లో భాగంగా కట్ట నిర్మాణం కోసం ఖుదాభాక్ష్ పల్లి గ్రామ పరిధిలో గతంలో 250 మీటర్లు లో కట్ట నిర్మాణం చేయాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు కుదాభాక్ష్ పల్లి గ్రామ రైతుల 58 ఎకరాల భూమి ముంపులో పోలేదు కానీ ఆ విస్తీర్ణాన్ని 650 మీటర్లు పొడిగించడం తో ఖుదాభాక్ష్ పల్లి రైతులు 58 ఎకరాల భూమిని కోల్పోతున్నారు కావున ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించే సమయంలో 250 మీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైతే కట్ట నిర్మాణం చేయాలని గుర్తించారో అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని అన్నారు. 650 మీటర్ల వద్ద చేయడంతో అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు తమకున్న పూర్తి జీవనాధారమైన భూములు కోల్పోయి రోజువారి అడ్డ కూలీలుగా మారే ప్రమాదం ఉందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మే న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల సిపిఐ సహాయ కార్యదర్శి బూడిద సురేష్ ,ఎరుకలి నిరంజన్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఇష్కిల్ల మహేందర్ , ఖుదాభాక్ష్ పల్లిగ్రామ రైతులు ఐతగోని లక్ష్మయ్య, మదగోని సైదులు, రమవత్ గణేష్ ,బ్రమ్మచారీ ,బిక్ష్మయ్య,యాదగిరి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.