ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆర్డీవోకి వినతి

నవతెలంగాణ-కంటేశ్వర్
ఇండ్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో కి వినతిపత్రం శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఇండ్లు ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ ఉత్తర మండల పరిధిలో సర్వేనెంబర్ 171,172 లలో గల ప్రభుత్వ భూమిలో గత ఏడాదిన్నరగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు, పలుమార్లు కనీస మౌలిక వసతులు త్రాగునీరు, కరెంటు సౌకర్యం అధికారులకు విన్నవించడం జరిగిందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేదలను నిర్లక్ష్యం చేసిందని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు, అధికారులు స్పందించి ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు గట్ల గంగాధర్, రామచందర్, పొడి శెట్టి లావణ్య, వి.మీరా, స్వప్న, మునవర్, మంజుల, రహమత్, భాస్కర్, రహేనబి, అంజయ్య, సుబ్బలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.