
భీంగల్ మండలంలోని బెజ్జోర గ్రామ శివారులో కప్పల వాగు నుండి కాంగ్రెస్ నాయకులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య జెడ్పిటిసి చౌట్ పల్లి రవి ఎంపీపీ ఆర్మూర్ మహేష్ , జెడ్పి కో ఆప్షన్ నెంబర్ మోయిజ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్ లు ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. బెజ్జోరా నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలని కోరుతూ తాసిల్దార్, సీఐ, ఎస్ఐలకు వినతి పత్రం అందజేసిన పట్టించుకోవడంలేదని కనుక తక్షణమే ఇసుక రవాణాను అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు పసుల ముత్తన్న, శంకర్ గౌడ్, పర్సన్ నవీన్ తదితరులు ఉన్నారు.