బిజెపి నేత రమేష్ బిదురిపై కేసు నమోదు చేయాలని వినతి ..

Request to file a case against BJP leader Ramesh Biduri..– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ 
నవతెలంగాణ – తాడ్వాయి 
మహిళా నేతలైన ఎంపీ ప్రియాంక గాంధీ వాద్ర పై బిజెపి నేత రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశాడని దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను దేవతల పూజించే హైందవ మతంలో బిజెపి నాయకులు వచ్చి 5 మతాన్ని చెడగొడుతున్నారని విమర్శించారు. ఎంపీ ప్రియాంక గాంధీ పై బిజెపి నాయకులు రమేష్ విట్టోరి వ్యాఖ్యలు యావత్ మహిళల్లోకానికి సిగ్గుచేటని అన్నారు. మొత్తాన్ని అడ్డుపెట్టుకొని అధికారులకు వస్తున్న బిజెపి పార్టీ మహిళలను నీచంగా చూడడం దుష్టకరమని అన్నారు. రమేష్ బిట్టూరి ని బిజెపి పార్టీ నుండి బర్తరపు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రనేత ప్రియాంక గాంధీ గారిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క ఖండించగా, ములుగు జిల్లాలోని బిజెపి నాయకులు సీతక్క గారి ఫ్లెక్సీలను చింపుతూ గుండాలుగా ప్రవర్తిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని, దాన్ని వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తాడ్వాయి మండల పోలీస్స్టేషన్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రేం పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ సర్పంచ్ సునీల్ దొర, ముజఫర్ హుస్సేన్, మాజీ చైర్మన్ పాక సాంబయ్య, డైరెక్టర్లు జగదీష్, నాయకులు నారాయణ బండారి చంద్రయ్య, పాక రాజేందర్, ఆలేటి జైపాల్ రెడ్డి, భూపతి జనార్ధన్, జాజ శివ, సదానందం, నారాయణ పులి రవి గౌడ్, రమేష్, నర్సింగరావు, కోరం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.