ఐకేపీ, వీఓఏ ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Request to solve the problems of IKP and VOAనవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో జరుపబోయే అసెంబ్లీ సమావేశాల్లో  ఐకేపీ, వీఓఏ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం నాగార్జున లోని బుద్ధ వనలలో ధర్మ చక్ర పరివర్తన్ దివస్ సందర్బంగా సాగర్ కు వచ్చిన సాగర్  నియోజకవర్గం ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి, తెలంగాణ పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి కి సీఐటీయు వీఏఓ ల  జిల్లా అధ్యక్షులు చిలుముల దుర్గయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల వీఓఏల సహాయ కార్యదర్శి తరి బిక్షమయ్య, మేడారం సత్యనారాయణ,రమావత్.బికోజినాయక్,వల్లపు.రాజేశ్వరి, జటావత్.సరోజ తదితరులు పాల్గొన్నారు.