దొంగతనాలను అరికట్టాలని వినతి..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

పంట పొలాల్లోని మోటార్ల విద్యుత్ తీగలను ఎత్తుకెళ్తున్న దొంగలను పట్టుకోవాలని కోరుతూ మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు గురువారం ఎస్ఐ రాజశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. రామ శివారులోని వరద కాలువ కెనాల్ కు ఆనుకొని సుమారు 50 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవన ఉపాధి పొందుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇటీవల తరచు అర్ధరాత్రి కొందరు దొంగలు వచ్చి విద్యుత్ తీగలను, వ్యవసాయ పనిముట్లను, డ్రిప్ పైపులను ఎత్తుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న దొంగలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని రైతులువిన్నవించారు.