పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలి వేణుమాధవ్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కొన్ని నెలల క్రితం కురిసిన వర్షాలకు, గ్రామాలలో ప్రాణహిత నది బ్యాక్ వాటర్ వల్ల వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి సహర సంఘం చైర్మన్ కుబిడే వెంకటేశం,సీనియర్ నాయకులు పురాణం లక్మీ కాంత్, మాజీ సర్పంచులు కొండగొర్ల బాపు, మోర్ల పద్మ-మొండి, బొర్కుటి సంతోష్, మాజీ ఉప సర్పంచ్ సత్యం, పలు గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.