విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి..

Request to the Collector to solve the problems of the students..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ  ప్రాథమిక , ఉన్నత పాఠశాలలో పిడిఎస్ యు ఆధ్వర్యంలో పాఠశాలల స్థితిగతులపై  సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాలలో  ఉపాధ్యాయులు,  అటెండర్లు, వాచ్మెన్, స్కావెంజర్ కొరత ఉందని , మధ్యాహ్న భోజనానికి సకాలంలో బిల్లులు రావడంలేదని, ప్రవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేయడం, అర్హత లేని వారి బోధన, ఫిట్నెస్ లేని బస్సులు, క్రీడ మైదానం లేకపోవడం, ఇరుకు గదిలో విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. డిమాండ్స్… ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న బోధన,బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలి. ప్రభుత్వ భవనాలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మించాలి, మూతపడిన పాఠశాలలను తెరిపించాలి. మధ్యాహ్న భోజన బిల్లులు నెలవారీగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చెల్లించాలి. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులను నియంత్రించి ఫీజు స్ట్రక్చర్ ను, నోటీసు బోర్డులలో అతికించాలి. ఫిట్నెస్ లేని బస్సులు నడితే యజమానియం పై కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కు  వినతిపత్రం అందజేసిన వారిలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి, రాష్ట్ర నాయకులు బూడిద శ్రావణ్ కుమార్, జిల్లా నాయకులు తుంగ శ్రావణ్ కుమార్, బరిగే  శివ లు పాల్గొన్నారు.