గుడి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతుల నుంచి మానేపల్లి రామారావు వారి కుటుంబ సభ్యులు దౌర్జన్యంగా భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి స్వర్ణగిరి దేవస్థానం నిర్మించి ప్రైవేట్ వ్యాపారం కొనసాగిస్తు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులతో నియమనిబంధనలకు వ్యతిరేకంగా రవణ సౌకర్యాన్ని అన్యాక్రాంతం చేస్తూ జాతీయ రహదారిపై వచ్చి పోయే వాహనాలకు ఇబ్బందిలకు గురి చేస్తూన్న ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దళిత నాయకులు బట్టు రామచంద్రయ్య జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే కీ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న అసైన్డ్ భూమిని అప్పటి రాజకీయ,ఆర్థిక పలుకుబడితో మానేపల్లి రామారావు వారి కుటుంబ సభ్యులు రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకుని స్వర్ణగిరి ఆలయం నిర్మించి అక్కడ వీక్ ఎండ్ వచ్చే భక్తులకు వాహనాలకు సరైన సందు లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో నియమనిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులచే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వచ్చే భక్తుల ఆదాయంతో లాభాలు గడించాడని ఆరోపించారు. వారిపై జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే చొరవ చూపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆలయాన్ని సక్రమంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో జాతీయ రహదారి నేషనల్ హైవే అథారిటీ వారు ఎల్లమ్మ గుడి నుంచి రైల్వే గేటు సమీపంలో సర్విస్ రోడ్డు నిర్మాణం చెప్పటకుండ అలాగే ఉంచారని ప్రస్తుతం స్వర్ణగిరి ఆలయ నిర్మాణంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయి తరుచూ ట్రాఫిక్ ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతుందని వెంటనే సర్విస్ రోడ్డు పూర్తి చేసి ప్రయాణికులకు వాహనాదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని,భువనగిరి సర్వీస్ రోడ్ ను బంద్ చేయకుండా వీక్ ఎండ్ రోజులలో పునరుద్దించాలని డిమాండ్ చేశారు.