వ్వవసాయ శాఖలో నాలుగేండ్లుగా విధులు నిర్వహిస్తున్న ఏఈవో లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ కు జుక్కల్ ఏఈవోలు వినతి పత్రం శుక్రంవారం నాడు పద్దుపోయాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సంధర్భంగా వినతిపత్రంలో తెలుపుతు నాన్ రెగ్యులర్ ఏఈవో యూనియన్ నాయకులు, ఏఈవో లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్వవసాయ శాఖ నందు అవుట్ సోర్సింగ్ లో ఏఈవో లు సుమారుగా నాలుగు వందల యాబై (450)మంది కి పైగా పనిచేయు చున్నారని, 29-05-2020 నుండి నాటీ నుంచి నేటి నరకు అనగా నాలుగేండ్లుగా వ్వవసాయ శాఖ లోని వివిధ పనులను, రెగ్యులర్ ఏఈవో తో సమానంగా పని భారాన్ని మెుస్తు సకాలంలో పనులన్నింటిని పూర్తీ చేస్తున్నామని పేర్కోన్నారు. ముఖ్యంగా 40% సాదారణ బదిలలో మాయెుక్క వర్కింగ్ ప్లేస్ ని ఖాలీగా చూపించడం వలన మా ఉద్యోగాలు కోల్పోతాము. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరనైనది. గత ప్రభూత్వం మా జీతాలను మద్యవర్తి ద్వారా ఆరు లేదా ఎనమిది నెలలకు ఒకసారీ అందచేసేవారని, అదికూడా ప్రభూత్వం చెప్పినంత ఇవ్వకుండా జీతంలలో కోత విధించి ఒక్క జిల్లాలో ఒక్కోక్క విధంగా అందచేయడం జర్గుతుందని, అందువలన సమాన పనిరి సమాన వేతనం అందించాలని వినతి పత్రంలో పేర్కోన్నారు.