
మండల పరిధిలోని ఉతలపల్లి గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ ను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన వ్యక్తిగత క్యాంప్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టవర్ ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో చుట్టుపక్కల ట్రెడిషన్ ప్రభావం ఉంటుందని దానివల్ల ప్రమాదం పొంచి ఉందని, ఆ టవర్ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి టవర్ నిర్మాణాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి యాదగిరి ,కావలి సురేష్ , సింగం కృష్ణ,కావలి రామలింగం, కావలి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.