సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

– ఆలిండ్‌ ఎంప్లాయిస్‌ కాలనీ, సుదర్శన్‌ నగర్‌ కాలనీ వాసులు
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని ఆలిండ్‌ ఎంప్లాయిస్‌ కాలనీ, సుదర్శన్‌ నగర్‌ కాలనీలలో గల పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులు ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ నీ అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆలిండ్‌ ఎంప్లా యిస్‌ కాలనీ, సుదర్శన్‌ నగర్‌ కాలనీల లో గత కొన్ని రోజులుగా మంచి నీటి సమస్య ఎదురైనది అని, తక్కువ ప్రెజర్‌తో మంచి నీరు వదులుతున్నా రని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చా రు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గాంధీ సంబం ధిత అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారు లకు సూచించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తాగు నీటి సరఫరాలో ఎటువం టి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, మళ్ళీ పునరావృతం కాకుండా చూడలన్నారు. ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు సరిపడా మంచి నీరు అందించాలని సూచించారు. అదేవిధంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఆలిండ్‌ ఎంప్లాయిస్‌ కాలనీ, సుదర్శన్‌నగర్‌ కాలనీల అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తానని వివరిం చారు. త్వరలోనే కాలనీలలో పర్యటిస్తామ ని, తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని అన్నారు. అదేవిధంగా కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని పేర్కొన్నారు. మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘా టించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సత్యనారా యణ, సత్యం, జీవరత్నం, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, సాయి రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, ప్రకాష్‌, ఉన్నం ప్రసాద్‌ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.