సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ – ఆర్మూర్  

పట్టణంలోని యానం గుట్ట సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కారం చేయాలని మంగళవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్టు సీపీఎం నాయకులు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీపీఎం నాయకులు కలసి యానం గుట్ట సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటి వారంలో యానం కొట్టను సందర్శిస్తానని అక్కడ పరిస్థితి నీకు తెలుసుకొని అధికారులతో మాట్లాడతానని తెలపడం జరిగింది డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ యానం గుట్ట సుందరయ్య కాలనీ ఒకసారి సందర్శించాలని అక్కడ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే గారికి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కృతాడు ఎల్లయ్య , డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, నవీన్ భాయ్, సాజిద్ ఖాన్ ,చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.