యూనివర్సిటీలో పనిచేస్తున్నఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి: రిజిస్ట్రార్ కు వినతి

request-to-the-registrar-to-regularize-the-outsourcing-employees-working-in-the-universityనవతెలంగాణ-డిచ్ పల్లి
సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థలు అనే పదాలు లేకుండా చేస్తానని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పినటువంటి వాటిని నిజం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరికి సోమవారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్ చేతుల మీదుగా డిమాండ్ల తో కూడిన వాల్ పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్బీ రవి, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్ బికోజి లు మాట్లాడుతూ గతంలో ఎన్నికల హామీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరు మీద, ఆ నినాదం మీద ఏర్పడ్డ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పదాలు వినపడవద్దని వారికి పూర్తిగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం అన్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుండి ఇప్పటివరకు గత 15 సంవత్సరాలకు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. కొందరు పదవీ విరమణ వయస్సు కు దగ్గరలో ఉన్నారు. ఇంక కొంత మందికి వయస్సు మీద పడుతుంది అయిన ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూనివర్సిటీలో ఎన్నో కొత్త కోర్సులు వచ్చిన వాటి అభివృద్ధి కోసం నిరంతరం ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస భద్రత లేదని చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉందని అన్నారు . మార్కెట్లో నిత్యవసర ధరలు, స్కూల్ ఫీజులు, తదితర రేట్లు అన్ని కూడా పెరుగుతున్నప్పటికీ కూడా ఉద్యోగస్తులు వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగస్తులకు చట్టబద్ధత కల్పించాలని ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం సుప్రీం కోర్టు తీర్పు ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు రవి, సురేష్ బికోజీ, నరేష్, డా. రవీందర్, రమేష్, శ్రీధర్, గణేష్, దిగంబర్, మమత, శోభరాణి, మౌనిక, వాకుల, పద్మ తదితరులు పాల్గొన్నారు.