దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని వినతి

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం పరిధిలో దేవాలయాల అభివద్ధికి కషి చేయాలని టీటీడీ బోర్డు చైర్మెన్‌ సాముల రామిరెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు ముత్తినేని వెంకటేశ్వరరావు పోతుగంటి రమేష్‌ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ పట్టణంలో వెంకటే శ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు వయోవద్ధులకు ఇబ్బందులు లేకుండా సులభంగా దర్శనం జరిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకో వాలన్నారు.అనంతరం సాముల రాంరెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివద్ధికి తన పరిధిలో కషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో పోనుగుపాటి వాసుదేవరావు, కందిబండగోపాల్‌, కామిశెట్టి శేషగిరి, నందయ్య, నాగేందర్‌ పాల్గొన్నారు.