భువనగిరి పట్టణంలో నిరుపేదలకు పట్టాలు ఇచ్చిన స్థలాలు చూపించాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్ల స్థలాలు చూపించాలని, 15, 20 సంవత్సరాల క్రితం భువనగిరి పట్టణంలో మొగ్గంపల్లి రైల్వే 700 సర్వే నెంబర్లు 105 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చనారని, హుస్నాబాద్ లోని ఇందిరమ్మ కాలనీలో మూడో విడతల వారికి చూపించే స్థలము లో తిమ్మాపురం గ్రామస్తులకు ఆ స్థలాన్ని కేటాయించి వారికి లేఔట్ చేసి ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు చూపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బందెల ఎల్లయ్య, వల్దాసు అంజయ్య, పర్వత్ బాలకృష్ణ, కొత్త లక్ష్మయ్య, పల్లెపాటి జయమ్మ, బండారి నవనీత, నర్సమ్మ, పర్వత్ దశరథ, కూరారం పోచయ్య లు పాల్గొన్నారు.