వికలాంగులకు నామినేటెడ్‌ పోస్టుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి

– ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌
నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
వికలాంగులందరికీ ఉచిత విద్యుత్‌, ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగుల పెన్షన్‌ 10వేల రూపాయలకు చెల్లించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్ష కె.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న 39 సమస్యపై వికలాంగుల డెకరేషన్‌ ప్రకటించామని డిక్లరేషన్‌ లో ఉన్నటువంటి అంశాలను రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 25000 ప్రత్యేక అలవెన్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ నియామకాల్లో వికలాంగుల రోస్టర్‌ ను పది లోపు తగ్గించేందుకు స్టేట్‌ సబర్దినెట్‌ సర్వీస్‌ రూల్స్‌ ని సవరించాలని డిమాండ్‌ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. నామినేటెడ్‌ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్‌ జిల్లా కోశాధికారి బొల్లేపల్లి స్వామి జిల్లా మహిళా కన్వీనర్‌ కొత్త లలిత జిల్లా నాయకులు సంజీవ శంకర్‌ చౌటుప్పల్‌ డివిజన్‌ కమిటీ నాయకుడు ప్రసాదం కష్ణ, రాయగిరి, యాదగిరి, బాలరాజు, కన్నెబోయిన మంగమ్మ, రంగ సంతోష్‌, మంద బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.