నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కులజనగణన చేపడుతామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం బిసిల దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి భిక్షపతి గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పున్నం విష్ణు జన్మదినం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో కుడకుడలోని అన్నపూర్ణ అనాధ, వృద్ధాశ్రమంలోని నిరాశృయులకు ఆయన పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకున్న విష్ణు మాట్లాడుతూ అనాథలను తనకు తోచిన రీతిలో కడుపునిండా భోజనం వడ్డిoచాలనే ఉద్దేశ్యంతో వారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాక బిసిల వాటా ప్రకారం 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అటువంటప్పుడే బీసీల అభ్యున్నతి సాకారమవుతుందని చెప్పారు. అందుకోసం బీసీ నాయకులంతా సంఘాలు వేరైనా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో అనాదాశ్రమ నిర్వాహకురాలు వనజ దంపతులు, కుషలవ, రాజు,తండు శ్రీను,సందీప్,ప్రవీణ్, రాము,కృష్ణ,శివ,యశ్వంత్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.