– రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ డిమాండ్
– రాష్ట్ర బడ్జెట్ లో రూ.5 వేల కోట్లు కేటాయించాలి
– ప్రతి మత్స్యకారుడికి రూ.5 లక్షల వ్యక్తిగత రుణాలివ్వాలి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మత్స్యకారులకు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం ఇబ్రహీంపట్నం మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు రావణమోని రాజు అధ్యక్షతన డాగ్ బంగ్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన మత్స్యకారులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మత్స్యకారులకు ఇచ్చే ఉచిత చేప పిల్లలు నాణ్యమైన 3 అంగుళాల ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప పిల్లలు సైజు సంఖ్యలో పరదర్శికత పాటించాలన్నారు. నాసిరకం సీడ్ ఇచ్చి మత్స్యకారులను మోసం చేయవద్దని అన్నారు. ప్రభుత్వం అధికారులను కాంట్రాక్టర్లను హెచ్చరించారు. 50 ఎండ్లు నిండిన మత్స్యకారులందరికీ ప్రతి నెల రూ.5000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్సీడీసీ ద్వారా రెండో విడతగా టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, డీసీఎం, టాటా ఏసీలు ఐస్ బాక్సులు వలలు వత్తి పరికరాలు 90శాతం సబ్సిడీతో ఇచ్చి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ప్రతీ మత్స్య సోసైటీకి రూ.20 లక్షలు, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చెరువులు, కుంటలు, జలవనరులను పెద్దఎత్తున కబ్జాలకు గగురవుతున్నాయని అధికారుల దష్టికి తీసుకొచ్చిన పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్సిగ్రేషియాలను వెంటనే చెల్లించాలన్నారు. సహజంగా మరణించిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల ఆర్థిక సహాయం అందించాలి, మరణించిన మత్స్యకార కుటుంబాలకు తక్షణ సహాయం 50 వేలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, మండల గౌరవ అధ్యక్షులు పూల యాదయ్య, మండల అధ్యక్షులు రావణమోని రాజు, మండల ప్రధాన కార్యదర్శి పిట్టల శేకర్ మండల నాయకులు పొన్నల జంగయ్య,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.