ఆశావాహులకు రిజర్వేషన్ టెన్షన్    

– సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మొదలైన హడావుడి

నవతెలంగాణ – భైంసా
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవడంతో ఆశావాహుల్లో రిజర్వేషన్ టెన్షన్ మొదలైంది. త్వరలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండడంతో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. రిజర్వేషన్లు యధా విధంగా ఉంటాయా లేదా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ మారుస్తుందా అన్న చర్చ గ్రామీణ రాజకీయాల్లో అగుపడుతుంది. ప్రభుత్వం బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించడం పై దృష్టి సారించడం, త్వరలో నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ ను ఆదేశించడంతో రిజర్వేషన్లు మారతాయన్న ఆలోచనమొదలైంది. జనరల్ స్థానాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడతారు. ఈ నేపథ్యంలో ఓసి అభ్యర్థులు తమకు పోటీపడే అవకాశం వస్తుందా లేదా అని ఆందోళన పడుతున్నారు. మహిళ, బిసి, ఎస్సీ, ఎస్టి, లకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తే జనరల్ స్థానాలు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ ప్రక్రియ ఆశా వాహు ల్లో కొంత టెన్షన్ కలిగిస్తుంది. గత సంవత్సర కాలంగా సర్పంచ్ పదవిపై ఆశ పెట్టుకున్న కొందరు రిజర్వేషన్ ప్రక్రియ తో పోటికి దూరమయ్యే ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి అగుపడుతుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాజకీయ పార్టీలు తమ నాయకులను గెలిపించు కునేందుకు ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు.