కంపు కొడుతున్న నిజాంసాగర్ కెనాల్..ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు

నవతెలంగాణ – ఆర్మూర్ 

నిజం సాగర్ కాలువలో మురుగు వరద పారుతుంది.. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు అయినా ఆర్మూర్,, వేల్పూర్ మండలాలలోని రైతులకు పంటల సాగుకు నీరు వస్తుంది కెనాల్ లో ఎక్కడపడితే అక్కడే చెత్త పేరుకుపోయి కంపు కొడుతుంది .చాపల, కోళ్లు వ్యర్థాలను ఈ కెనాల్ లో పడేయడంతో దుర్గాంత భరిత వాసనతో ఇక్కడి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .కాలువ పారిన కొద్ది రోజులు బాగుగా ఉన్న నీరు నిల్వ ఉండడంతో కెనాల్ కంపు కొడుతుంది ..నిజాంసాగర్ ప్రాజెక్టులో నీరు చేరి ఆయకట్టులోని చెరువులకు నింపేందుకు నీటిని వదిలితే కెనాల్ లోని మురుగంత చెరువుల్లోకి చేరుకుంటుంది.. దీంతో చెరువుల్లోని నీరంతా కలుషితమవుతుంది .. తద్వారా చెరువుల్లోని జీవరాసులు మరణించే ప్రమాదం ఉంది.

వ్యాధుల బారిన పడే అవకాశం: మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పాత గ్రామపంచాయతీ భవనం( బస్తీ దావకాన) పక్కన నుండి నిజాంసాగర్ కెనాల్ ఉంటుంది. కెనాల్ మొత్తం మురుగు వ్యర్థాలతో పేరుకు పోతుంది. వివిధ పనుల కోసం ఇక్కడకు వచ్చే ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుంది. కెనాల్ లో పేరుకుపోయిన మురుగు నీటితో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి: నిజాంసాగర్ కెనాల్ లో మురుగునీరు కలవకుండా సంబంధిత నాయకులు, ఇరిగేషన్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో బస్తీ దావకాన పక్కన ఉన్న కెనాల్ లోని మురుగుతో వ్యర్థ పదార్థాలతో వచ్చే దుర్వాసనతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం కాయంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజం సాగర్ కెనాల్ మురికినీరు కల్వకుండా చూసి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మురుగు కల్వకుండ చేయాలి: నిజం సాగర్ కెనాల్ లో వచ్చే నీటితో కొన్నేళ్లుగా పరిసరాలలోని చెరువులను అధికారులు నింపుతున్నారు. కెనాల్ లో మురుగు వ్యర్థాలతో నిండిపోతుంది. గోవింద్ పెట్ వెళ్లే దారిలో కెనాల్ మురికి కోపంలో తయారయింది. సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి కెనాల్నో మురుగు కలవకుండా ,ప్రజలు వ్యర్ధాలు వేయకుండా చూడాలి..ఈశ్వర్, స్థానికుడు.