నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన న్యూ రామ్ నగర్ కాలనీ వాసులు….

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి నూతన మున్సిపల్ చైర్మన్ పొత్తంశెట్టి వెంకటేశ్వర్లను సోమవారం న్యూ రామ్ నగర్ కాలనీవాసులు ఆయన స్వగృహంలో  శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నువ్వు రాంనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ కోరినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మల్లారెడ్డి, సుబ్బారావు, సురేష్, గడ్డమీద పాండు, సత్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కంఠం నరేష్ , శ్రీకాంత్, వెంకటాద్రి లు పాల్గొన్నారు.