కష్టపడి పని చేస్తే గౌరవం దక్కలేదని రాజీనామా

– మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ అధ్యక్షుడు జయ వెంకటరెడ్డి
నవతెలంగాణ-చేగుంట
ముందు వచ్చిన వారి కంటే తర్వాత వచ్చిన వారికి కాంగ్రెస్‌ పార్టీ అరుదైన గౌరవం ఇచ్చి, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే చివరికి మనోవేదనను మిగిల్చాయని మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ అధ్యక్షుడు జే. వెంకట్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌కు తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కోసం సుమారు 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసి, ఒక నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశానని, కష్టకాలంలో కూడా పార్టీలో కొనసాగామని తెలిపారు. అలాగే జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఎనలేని కషి చేశారని, కష్ట కాలంలో పార్టీని ముందుండి నడిపించి జిల్లాలో ఒక బలమైన శక్తిగా నిర్మించిన తీరు, కష్టపడి పనిచేసిన కంట రెడ్డి తిరుపతి రెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్‌ విషయంలో అధిష్టానం పెద్దలు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి భవిష్యత్తు లేదని తేటతెల్లమైనదని, డబ్బుల కట్టలకు పైరవీకారులకు టిక్కెట్లు కేటాయించడం జీర్ణించుకోలేకనే తీవ్ర మనస్థాపనతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు. పార్టీలో పని చేసిన ఇన్ని రోజులు నాకు అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికి కతజ్ఞతలు తెలియజేశారు.