రామారెడ్డి లో రైతుల నూతన సొసైటీని ఏర్పాటు చేయాలని బుధవారం అట్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి అధ్యక్షతన పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు. నూతనంగా ఏర్పడిన మండలంలో 11 గ్రామపంచాయతీలు ఉన్న సొసైటీ లేకపోవడంతో రైతులకు ఇబ్బంది ఉన్నందున ప్రభుత్వం నూతన సొసైటీ ని ఏర్పాటు చేసి రైతులకు సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, పాలకవర్గ సభ్యులు గురుజాల నారాయణరెడ్డి, గొల్లపల్లి లక్ష్మా గౌడ్, రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి,సిఇఓ కడెం బైరయ్య తదితరులు ఉన్నారు.