దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం

– టీజీఏఆర్‌ఐఈఏ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, గురుకులం (ఎస్టీ సొసైటీ) అధికారులకు తెలంగాణ గవర్నమెంట్‌ ఆల్‌ రెసిడెనిషయల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి నారాయణ, డాక్టర్‌ మదుసూదన్‌, టీజీపీఏ అధ్యక్షులు డాక్టర్‌ అజరుకుమార్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవోను అమలు చేస్తూ నూతన జోనల్‌ ప్రకారం క్యాడర్‌ కేటాయింపులు పూర్తి చేసి ఉత్తర్వులు ఇచ్చిన సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మికి కూడా ధన్యవాదాలు తెలిపారు.