
నవతెలంగాణ-ఉప్పునుంతల
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి రిజిస్ట్రేషన్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ధరణి లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామస్తుడైన కుందేళ్ళ వెంకటరమణ తల్లి పేరు నుండి గిఫ్టు డిడిగా అక్టోబర్ 2021 సంవత్సరంలో తన పేరు మీద చేసుకున్నాడు. ధరణి మొదటి సారి కావడంతో తెలుగులో తన పేరు కొన్ని తప్పులు దొర్లాయి. బాధితుడు రోజుల తరబడి పలమార్లు ఎమ్మార్వో, కలెక్టర్ ప్రజావాణికి ఎన్నోసార్లు విన్నవించుకున్న ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోలేదు. నవ తెలంగాణ పత్రిక దృష్టికి సమస్య రాగా.*నాలుగేండ్లైన ధరణిలో అక్షర దోషం మార్చలే* అనే కథనాన్ని గత నెల 20వ తేదీన ప్రచూరించగా వెంటనే స్పందించిన జిల్లా రెవెన్యూ కలెక్టర్, ఎమ్మార్వో ప్రమీల బాధితుని సమస్య ఎవరి పరిధిలో ఉన్నట్లని పూర్తి పరిశీలన కొనసాగించి ఈ రోజు శుక్రవారం బాధితుని కుందేళ్ళ వెంకటరమణ అక్షర దోషానికి నాంది పలికి పూర్తి పేరు సవరణ చేసి నమోదు చేసిన జిల్లా కలెక్టర్ యజమాన్యానికి, నవతెలంగాణ పత్రిక రిపోర్టర్ లక్ష్మణ్ కు బాధితుడు ఫోను ద్వారా తెలిపి హర్షం వ్యక్తం చేశాడు. పత్రిక పట్టించుకోకపోతే సమస్య పరిష్కారం కాకపోయుండేదని పత్రికను కొని ఆడారు. నవ తెలంగాణకు ఎప్పుడు రుణపడి ఉంటానని కుందేళ్ళ వెంకటరమణ తెలిపారు.