బడిబాటకు స్పందన..

నవతెలంగాణ- నసురుల్లాబాద్
జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం బీర్కూర్ మండలంలోని దామరాంచ, బైరపూర్ గ్రామంల్లో పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ అన్ని వసతులు కలిగిన ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని కరపత్రాలు పంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల కృషితో మొదటి రోజు18 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి ద్వార పాఠశాలలో వచ్చిన మార్పు ఆహ్లాదకర వాతావరణం గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారనే మంచి విద్యా అందుతుందన్నారు. ప్రతీ ఒక్కరు తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో వివిద పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.