– చిత్తాపూర్ రోడ్డుపై పారుతున్న అండర్ డ్రయినేజీ వాటర్
– పరిశీలించిన అధికారులు
– త్వరలోనే సమస్య పరిష్కారం కోసం కృషి ఎంపీడీఓ బాల శంకర్
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని చిత్తాపూర్ గ్రామం నుం డి తిప్పాయిగూడ వెళ్ళే రోడ్డుపై పారుతున్న అం డర్ డ్రయినేజీ వాటర్ సమస్యనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చేస్తామని ఎంపీడీఓ బాలశంకర్ తెలిపారు. శుక్రవారం నవ తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిం చిన అధికారులు అండర్ సమస్యను పరిశీ లించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తా పూర్ గ్రామానికి వెళ్లి అండర్ డయినేజీ, నీటి సమ స్యను శక్రవారం పరిశీలించారు. ఈ సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. బీఅర్ ఎస్ నాయకులు ఆవుల శ్రీను యాదవ్, సీపీఐ (ఎం)మిటీ సభ్యులు ఆవుల యాదయ్యలు మాట్లా డుతూ..సమస్యపై స్పందించిన అధికారులకు కృ తజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ మధు సూదన్‌చారి, పంచాయితీ కార్యదర్శి దివ్య, తదితరులున్నారు.