నవతెలంగాణ కథనానికి స్పందన

– పాత రుద్రారంలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు
నవతెలంగాణ మల్హర్ రావు
నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో మంగళవారం ప్రచురించిన ,అపరిశుభ్రంగా పాత రుద్రారం, అనే కథనానికి ఎట్టకేలకు  మండల పరిషత్ అధికారులు స్పందించారు. మండల ఎంపీవో విక్రమ్ కుమార్ ఆదేశాల మేరకు రుద్రారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి చరణ్ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు.మిషన్ భగీరథ తాగునీరు కలుషితం కాకుండా,మురుగునీరు,వర్షపు నీరు చేరకుండా గెట్ వాల్ పై కప్పు వేశారు.గ్రామంలో 1వ,6వ రెండు వార్డుల్లో మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్త,చెదారం తొలగించారు.అంతర్గత రోడ్లపై మురికి నీరు ప్రవహించకుండా జేసిబితో సైడ్రేన్ కాల్వలు తీశారు.అంతర్గత రోడ్లకు ఇరువైపులా ఉన్న ,పిచ్చిమొక్కలు,గడ్డిని శుభ్రం చేశారు.ఈగలు,దోమలతో,సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు.