
– పంచాయతీ కార్యదర్శి అదేశాలు
– ఇసుకను తొలగించిన ఇంటి యజమాని
నవతెలంగాణ – బెజ్జంకి
నవతెలంగాణ కథనానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించారు.మండల కేంద్రంలోని బస్టాండ్ అవరణం వద్ద గత కొద్ది నెలలుగా రోడ్డుపై ఇసుక నిల్వ చేయడంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విస్తరించిన..ఇరుకే..ఇరుకే శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది. నవతెలంగాణ దినపత్రిక కథనానికి స్పందించిన పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి రోడ్డుపై నిల్వ చేసిన ఇసుకను తొలగించాలని ఇంటి యజమానిని అదేశించారు.శుక్రవారం ఇంటి యజమాని రోడ్డుపై నిల్వ చేసిన ఇసుకను తొలగించారు.పలువురు స్థానికులు,వాహనదారులు నవతెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.