నవతెలంగాణ కథనానికి స్పందన

– మేడిపల్లి కాదు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో అలర్ట్‌
– ఇది పునారావత్తంకాకూడదు అంటున్న గ్రామస్తుల
– డంపింగ్‌ యార్డు మాత్రమే ఉపయోగించాలని ఆర్డర్‌ వేసిన అధికారులు
– నవతెలంగాణ కతజ్ఞతలు తెలుపుతున్నా గ్రామస్తులు
నవతెలంగాణ-మొయినాబాద్‌
మండలంలోని మేడిపల్లి గ్రామంలో కొంత కాలంగా గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని చెత్త వ్యర్థాలను ప్రతిరోజూ సేకరించి డంపింగ్‌ యార్డులో పోయకుండా రోడ్డు పక్కన పోస్తున్నారు. దాంతో కూరుకుపోయిన చెత్త, వ్యర్థాలతో ఆ సమీ పంలో పూర్తిగా దుర్గంధం వేదజల్లుతూ సిబ్బంది ఆ చెత్తాను కాల్చేయడానికి నిప్పు అంటించడంతో రోజం తా పొగ రాజుతూ వచ్చే పోయే వారికి తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు తినుబండారాలు, వ్యర్థాలకు అలవాటు పడిన గ్రామంలోని కుక్కలు గుంపులు గుంపులుగా ఏర్పడి స్వైరా విహారం చేస్తూ వాహన దారులను తరుముతు వచ్చి పోయే వారిపై దాడులు చేస్తున్నాయని, గ్రామస్తులు పలుమార్లు గ్రామ పం చాయతీ పాలకవర్గానికి, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వారి నుండి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన గ్రామస్తులు నవతెలంగాణ ప్రతినిధిని ఆశ్రయించడంతో శుక్రవారం నవతెలంగాణ పత్రిక లో డంపింగ్‌ యార్డు వద్దు… రోడ్డు పక్కన ముద్దు కథనానికి స్పందించినా మండల ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి ఎంపీడీఓ సంధ్యా వెంటనే డోజర్‌, ట్రాక్టర్‌ల స హాయంతో ఎంతో కాలంగా కూరుకుపోయి దుర్గం ధం వేదజల్లుతున్న చెత్తను గ్రామ పంచాయతీ కార్య దర్శి మురళి దగ్గరుండి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచేలా చేశారని తెలిపారు.అందుకు స్పందించిన గ్రామస్తులు నవ తెలంగాణ పత్రికకు కతజ్ఞతలు తెలిపారు. ఇది తాత్కాలికంగా కాకుండా ఎప్పటికి ఇలాగే ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పాలక వర్గాన్ని కోరుతున్నారు. మండల ఎంపీఓ వెంకటేశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ మేడిపల్లి గ్రామమే కాదు మండలంలోని అన్ని గ్రామా పంచాయతీలను ఇలాంటి సమస్య తలెత్తకుండా డంపింగ్‌ యార్డు ఉపయోగించాలని అలర్ట్‌ జారీ చేసినట్లు తెలిపారు.