నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం గువ్వలోని పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న పశువుల త్రాగు నీటి హౌస్ ‘మురుగునీరు నిల్వ ఆరోగ్యానికి ముప్పు’ గ్రామ పంచయతీ కార్యాలయం ముందే ఈ దుస్థితి అనే కథనాన్ని నవ తెలంగాణ పత్రికలో బుధవారం ప్రచూరించగా స్పందించిన జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శి ఆదేశాలు ఇవ్వగా పంచాయతీ కార్యదర్శి, గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్ సాయంతో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మరుగున పడిన నీటిని తొలగించి శుభ్రపరిచారు. అధికారులు స్పందించిన విషయంపై గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించినందుకు నవతెలంగాణ పత్రికకు కొందరు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.