“నవతెలంగాణ వార్తకు స్పందన్న”

"Reaction to Navtelangana News"– 126 సర్వే నెంబర్ లో  అక్రమ నిర్మాణలను పరిశీలించిన తహసీల్దార్
– 70 మందికి నోటీసులు జారీ
– పై స్థాయి అధికారులకు నివేదిక
– అక్రమ నిర్మాణాల పై చర్యలు.. తహసీల్దార్ కృష్ణయ్య
నవతెలంగాణ – సూర్యాపేట
జిల్లా కేంద్ర పరిధిలో గల కుడ కుడా లోని 126 వ సర్వే నెంబర్ లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని గురువారం నవ తెలంగాణ దిన పత్రిక లో వచ్చిన వార్త పట్ల చివ్వేంల మండల తహసీల్దార్ కృష్ణయ్య స్పందించారు.ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ సిబ్బంది తో కలిసి ఆయన 126 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. పట్టణంలో నుంచి కుడ కుడా కు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే కోమటి కుంట నుండి నూతనంగా ఏర్పడిన కలెక్టరేట్ కు వెళ్లే ప్రధాన రహదారి కి అనుకోని ఉన్న పల్లె ప్రకృతి వనం ఎదురుగా ఉన్న 126 సర్వే నెంబర్ కు చెందిన గుట్ట ప్రాంతంలో  విరుద్ధంగా వెలుస్తున్న వరుస నిర్మాణాలపై వారు విచారణ నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని వచ్చిన కథనం ప్రకారం వారు 126 సర్వే నెంబర్ లో ఉన్న స్థలంలో నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. కాగా ఇక్కడి అక్రమ నిర్మాణదారులు ప్రభుత్వ భూమితో పాటు ప్రక్కనే కె.చంద్రశేఖర్ కు చెందిన 127 వ సర్వే నెంబర్ భూమి లో వంద గజాల స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణo చేపట్టడాన్ని వారు గమనించారు. అదేవిధంగా ప్రభుత్వానికి చెందిన స్థలం లో దాదాపుగా 70 మంది అక్రమంగా ఇండ్లను నిర్మించుకోవడాన్ని చూసిన తహసీల్దార్ తక్షణమే నిర్మాణం చేపడుతున్న ఇళ్లను కూల్చివేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన నవ తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ.. 126 వ సర్వే నెంబర్ ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అని పేర్కొన్నారు. ఇందులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రస్తుతం 70 మంది వరకు ఇందులో అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారని వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. స్పందించక పోతే వెంటనే వాటిని కూల్చి వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా  కె.చంద్రశేఖర్ కు చెందిన 127 వ సర్వే నెంబర్ లో కూడా వంద గజాల మేరకు ఆక్రమించి నిర్మాణం చేశారని దీన్ని పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణ దారులు స్వచ్ఛందo గా నిర్మాణాలు తొలగించుకోవాలని లేని పక్షంలో వాటిని కూల్చి వేసి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం  జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పై స్థాయి అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఆయన వెంట ఆర్ఐ శ్రావణి, సర్వేయర్ శ్రీనివాసరావు, సిబ్బంది వున్నారు.