నవతెలంగాణ – నసురుల్లాబాద్
జనసంచారం ఉన్నచోట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండడంతో మూడు ఆవులు మృతి చెందాయి దీనితో నవ తెలంగాణ పత్రికలో గురువారం జనసంచారంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ అనే శీర్షికతో వార్త ప్రచారతం కావడంతో నవతెలంగాణ వార్త పేపర్ కటింగ్ సోషల్ మీడియాతో వైరల్ కావడంతో విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు సాయిబాబా కళ్యాణ మండపం నిర్వాకులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచి వేశారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ పక్క నుంచి నాచుపల్లి కి వెళ్లే రహదారి ఉండడం, పక్కనుండే కళ్యాణం మండపానికి వెళ్లే దారి ఉండడంతో జనాలు సంచరించే ప్రదేశం లో ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో, ఆవులు మృతి చెందడంతో ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మండపం నిర్వాహకులు అటు వైపు పశువులు గాని మనుషులు గాని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం గద్దె నిర్మించారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను త్వరలో నిర్మించిన గద్దెపై ఏర్పాటు చేస్తామని మండపం నిర్వాహకులు తెలిపారు.