నవతెలంగాణ వార్తకు స్పందన..

– తోటపల్లిలో అక్రమ వెంచర్ పై విచారణ 

– వెంచర్ ను సందర్శించిన తహసీల్దార్, ఎంపీఓ 
నవతెలంగాణ – బెజ్జంకి 
చెరువు కాల్వను అక్రమించి..అక్రమంగా వెంచర్ నిర్మాణం శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక మంగళవారం వార్తను ప్రచురించింది. నవతెలంగాణ వార్తకు స్పందించిన తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్,ఎంపీఓ విష్ణు వర్ధన్ మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన అక్రమ వెంచర్ ను సందర్శించి విచారణ చేపట్టారు.అక్రమణకు గురైన చెరువు సాగు కాల్వ భూమిని సర్వే చేయించి తగు చర్యలు చేపడుతామని..ప్రభుత్వ అనుమతుల మేరకు ప్రజలకు ప్లాట్లను విక్రయించాలని..వెంచర్ నిర్వహాకులు అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు తహసిల్దార్ శ్యామ్ సూచించారు.