నవతెలంగాణ వార్తకు స్పందన…

Response to Navtelangana news...– గుత్తేదారు నిర్లక్ష్యంతోనే..రోడ్డుపై మురుగు నీరు..

– పంచాయతీ రాజ్ ఏఈ సమ్మయ్య స్పష్టం 
– పునర్మిణానికి కలెక్టరుకు ప్రతిపాదనలు..
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలో గత కొద్ది నెలల క్రితం నిర్మించిన అంతర్గత మురికి కాల్వ నీరు రోడ్డుపై పారుతుండడంతో నవతెలంగాణ దినపత్రిక బాధ్యులెవరూ..!శీర్షికతో శనివారం వార్తను ప్రచురించింది.నవతెలంగాణ దినపత్రిక వార్తకు పంచాయతీ రాజ్ శాఖ ఏఈ సమ్మయ్య స్పందించారు.గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే మురుగు నీరు రోడ్డుపై పారుతోందని ఏఈ సమ్మయ్య స్పష్టం చేశారు. మురికి కాల్వను పునర్మిణాం చేపడుతామని ఏఈ తెలిపారు.
రూ.90 లక్షల ప్రతిపాదనలు…
మండల కేంద్రంలో పూర్తిగా అంతర్గత మురికి కాల్వల నిర్మాణానికి ఎన్ఆర్ జీఎస్ పథకంలో రూ.90 లక్షల ప్రతిపాదనలను కలెక్టరుకు పంపించామని ఏఈ సమ్మయ్య తెలిపారు.కలెక్టరు మంజూరీ చేస్తారని ఏఈ సమ్మయ్య శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు.