– ధరలు సూచీ ప్రదర్శన..
– రూ.200 లు ధరతో విక్రయాలు..
– హర్షం వ్యక్తం చేస్తున్న చికెన్ ప్రియులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పేటలో చికెన్ సిండికేట్ శీర్షికన సోమవారం నవతెలంగాణ లో ప్రచురితం అయిన కథనానికి స్పందన లభించింది.కధనం అనేక వాట్సాప్ సమూహాల్లో వైరల్ కావడంతో సిండికేట్ దారి కొచ్చారు. సోమవారం బహిరంగ మార్కెట్ లో చికెన్ కేజీ ధర రూ.240 లు ఉన్నప్పటికీ ప్రతీ దుకాణం యజమాని రూ.200 లు ధర సూచిస్తూ పాలకులు పై ప్రదర్శించారు.దీంతో ఒక్క సారిగా కేజీ కి రూ.40 లు తగ్గడంతో చికెన్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరలు వ్యవహారంలో నష్టం వస్తుందని తక్కువ, సరసమైన ధరకు అమ్మే దుకాణం కార్మికుడు పై దాడి చేసిన సిండికేట్ లోని ఓ సభ్యుడు ఉదంతం పాఠకులకు విదితమే. నేడు రూ.200 లు కే ఎలా విక్రయించారు అనేది సందిగ్ధం.